Kerala High Court : కాంగ్రెస్ జెండాలు..బ్యాన‌ర్ల‌పై కోర్టు ఫైర్

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా ఏర్పాటు

Kerala High Court : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సుదీర్ఘ యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. త‌మిళ‌నాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు.

భార‌త్ జోడో యాత్ర 3,570 కిలోమీట‌ర్ల మేర కాశ్మీర్ దాకా 150 రోజుల పాటు కొన‌సాగుతుంది. యాత్ర త‌మిళ‌నాడులో పూర్త‌యింది. కేర‌ళ‌లో కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా కేర‌ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఎక్క‌డ చూసినా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు, బ్యాన‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. దీనిపై కేర‌ళ కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

ఎలాంటి ప‌ర్మిష‌న్ లేకుండా ఎలా జెండాలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేస్తారంటూ ప్ర‌శ్నించింది. త్రివేండ్ర నుంచి త్రిస‌సూర్ వ‌ర‌కు , జాతీయ ర‌హ‌దారికి ఇరు వైపులా జెండాలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు.

ఈ విష‌యం గురించి ఉన్న‌తాధికారుల‌కు తెలిసినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేక పోయారంటూ ప్ర‌శ్నించింది కోర్టు(Kerala High Court). దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతాయో తెలిసి కూడా ఎందుకు జెండాలు, బ్యాన‌ర్ల‌ను తొల‌గించ‌లేదంటూ ప్ర‌శ్నించింది.

రోడ్ల‌పై అక్ర‌మంగా బ్యాన‌ర్లు, బోర్డుల వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు జ‌స్టిస్ దేవ‌న్ రామ‌చంద్ర‌న్. సింగిల్ బెంచ్ ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఇలా చ‌ట్ట విరుద్దంగా ఏర్పాటు చేసిన వాటి వ‌ల్ల ప్రమాదం పొంచి ఉంది. వ‌ర్షాలు, గాలి ఎక్కువ‌గా వీస్తే జెండాలు, బ్యాన‌ర్లు ప‌డి పోయే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించింది కోర్టు. వీటి ఏర్పాటు వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి పెను ప్ర‌మాద‌మ‌ని పేర్కొంది.

Also Read : కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!