Kesineni Nani: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !
Kesineni Nani: 2019లో చంద్రబాబు ప్రధాన మంత్రి అయిపోవాలని దురాశకు పోయారంటూ…. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడని… కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని పగటికలలు కన్నాడని అన్నారు. అయితే 2019లో వైఎస్ జగన్ దెబ్బకు చంద్రబాబు బొక్కబోర్లా పడ్డాడన్నారు. తాను ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుందని… 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ చేసిన అవినీతికి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడన్నారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటికి వచ్చాడో. తిరిగి ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి’’ అంటూ ఎద్దేవా చేసారు.
Kesineni Nani Comments on Chandrababu
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘‘అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు. ‘‘అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి ?. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా ?. రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా ?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా ? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా ? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు ?. తాను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం. టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది.
Also Read : Konda Surekha: ఎంజీఎం ఆసుపత్రిలో మంత్రి కొండా సురేఖ పర్యటన !