Kesineni Nani: చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !
చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !
Kesineni Nani: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటని… గతంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆయనేనంటూ… ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మండిపడ్డారు. గతంలో తన ఫోన్‌ను మోదీ ట్యాపింగ్ చేయించారని చంద్రబాబు ఆరోపించాడు… ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని ఆయన దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించండి. నా ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న నాకేం భయం లేదు. సీఎం జగన్ కి, నాకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్‌ని పంపిస్తారా ?. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు’’ అని కేశినేని పేర్కొన్నారు.
Kesineni Nani Comments on Chandrababu
‘‘విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయన భూ కబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే. లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు’’ అని ఎంపీ కేశినేని నాని అన్నారు.
Also Read : Anna Hazare: కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన ప్రకటన !