Nara Lokesh: నారా లోకేష్ కాన్వాయ్‌ తనిఖీ ! నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు !

నారా లోకేష్ కాన్వాయ్‌ తనిఖీ ! నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు !

Nara Lokesh: దేశ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోనికి రావడంతో… రాజకీయ నాయకుల కదలికలు, కార్యక్రమాలపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేసారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయా నేతలు, అధికారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కారుని పోలీసులు తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్((Nara Lokesh) కాన్వాయ్ ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు లోకేష్‌ కి చెప్పారు. దీనితో వారికి లోకేష్ పూర్తిగా సహకరించారు. కోడ్‌ కు విరుద్ధంగా కాన్వాయ్‌ లో ఏమీ లేవని పోలీసులు నిర్ధారించారు. దీనితో అక్కడ నుండి లోకేష్ ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

అయితే లోకేష్ కాన్వాయ్ లో భారీగా డబ్బులు దొరికాయంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన నారా లోకేష్… వైసీపీ సోషల్ మీడియాపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఫేక్ పోస్టులు పెడుతున్న వైసీపీ పేటిఎం బ్యాచ్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

Nara Lokesh – నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని… ఇది ఎన్నికల రూల్స్‌ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Kesineni Nani: చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!