Kishan Reddy : ఒంటరి గానే ఎన్నికల్లోకి
స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
Kishan Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ చీఫ్, కేంద్ర మంత్రిగా కొలువు తీరిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే లోక్ సభ కు ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు పూర్తిగా సమర్థవంతమైన పాలన సాగిస్తున్న బీజేపీకి తిరిగి మరోసారి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని అర్థమై పోయిందన్నారు కిషన్ రెడ్డి.
Kishan Reddy Comment
ఇక తెలంగాణలో మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని , తమకు 8 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారని తెలిపారు. అంతే కాకుండా 18 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు . కానీ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము కలిసి వెళ్ల కూడదని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి(Kishan Reddy). మొత్తం 17 సీట్లకు గాను తమకు కనీసం 15 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు .
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈసారి బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని , ఇప్పటి నుంచే కింది స్థాయి నుంచి కార్యకర్తలు బలంగా పని చేస్తున్నారని చెప్పారు. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Also Read : Ambati Ram Babu : చంద్రబాబుకు మతి చెడింది