కోల్ కతా : బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలనంగా మారాడు. తనను ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది కేకేఆర్ యాజమాన్యం. తాజాగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ సంచలన నిర్ణయం తీసుకుంది కేకేఆర్. దేశ వ్యాప్తం గా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న హిందువులపై దాడులకు వ్యతిరేకంఆ తనను ఆడిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు వచ్చాయి. దీంతో గత్యంతరం లేక కేకీఆర్ ఓనర్స్ , ప్రముఖ బాలీవుడ్ నటులు జూహ్లీ చావ్లా, షారుక్ ఖాన్ లు ప్రత్యేకంగా టీం హెడ్ కోచ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ , స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను వదులు కుంటున్నట్లు ప్రకటించారు షారుక్ ఖాన్. ఈ మేరకు ఆయన స్పెషల్ గా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా తనను తీసుకోవడం లేదని తెలిపాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వీడియో సందేశాన్ని షేర్ చేశాడు.
అంతకు ముందు ఐపీఎల్ ను నిర్వహిస్తూ వస్తున్న బీసీసీఐ సమావేశమైంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి సైకియా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్లకు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ టోర్నీలో ఛాన్స్ ఉండదని సూచన ప్రాయంగా స్పష్టం చేశాడు. అంతే కాకుండా ముస్తాఫిజుర్ రెహమాన్ ను తీసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు వెంటనే తనను డ్రాప్ చేయాలని సూచించారు. దీంతో కేకేఆర్ కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అత్యధిక ధరకు తీసుకుంది రెహమాన్ ను. రూ. 9.20 కోట్లకు తీసుకుంది. తనను డ్రాప్ చేయడంతో ఈ పరిహారం తనకు అందదు.
