హైదరాబాద్ : నటి పూనమ్ కౌర్ నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. నిన్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఏకి పారేసిన నటి తాజాగా తనకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, అమెథీ ఎంపీ రాహుల్ గాంధీతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటించింది. సినీ , రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఆ మధ్యన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తను కూడా పాల్గొంది. ఆయనతో పాటు నడిచింది. తన చేతిని పట్టుకుని ముందు వరుసలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి తనకు , రాహుల్ గాంధీకి మధ్య ఏదో ఉందంటూ కొనసాగుతున్న దారుణమైన ప్రచారంపై తీవ్రంగా స్పందించింది నటి పూనమ్ కౌర్. మంగళవారం సీరియస్ అయ్యింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి బంధం లేదని పేర్కొంది. అయితే ఆయన ముందు చూపు కలిగిన నాయకుడు అని పేర్కొంది. కొన్ని మీడియా సంస్థలు కావాలని తామిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. ఆధారాలు లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పూనమ్ కౌర్. నటి మొదటిసారిగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో తనకు సంబంధం ఉన్న పుకార్లను బహిరంగంగా ప్రస్తావించింది. వ్యక్తిగత సంబంధాన్ని గట్టిగా ఖండించింది. తన చేనేత వ్యాపారానికి సంబంధించి మాత్రమే రాహుల్ గాంధీని కలిశానని , ఒక కార్యక్రమంలో ఆయనతో కొంతకాలం నడిచానని ఆమె స్పష్టం చేసింది. పూనమ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, తనకు రహస్య పిల్లలు ఉన్నారని కొన్ని సంస్థలు పేర్కొన్నాయంటూ వాపోయింది.
