KKR IPL 2023 Auction : దేశీ ఆటగాళ్లకే కోల్ కతా ప్రయారిటీ
ఎనిమిది మంది ఆటగాళ్ల కొనుగోళ్లు
KKR IPL 2023 Auction : షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా యజమానులుగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి దేశీయ ఆటగాళ్ల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కేరళ లోని కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం పాట ముగిసింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ ఈసారి మరింత బలంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో జట్టు ఆశించినంత మేర రాణించ లేక పోయింది. తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.
తమిళనాడుకు చెందిన ఎన్. జగదీషన్ ను కోల్ కతా నైట్ రైడర్స్(KKR IPL 2023 Auction) రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా మినీ వేలం పాటలో దమ్మున్న ఆటగాళ్లకు ప్రయారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా వేలం పాటలో ఎన్. జగదీషన్ తో పాటు వైభవ్ అరోరా , సూయస్ శర్మ, డేవిడ్ వైస్ , ఖేజ్రోలియా కుల్వంత్ , లిట్టన్ దాస్ , మన్ దీప్ సింగ్ , షకీబ్ అల్ హసన్ కొనుగోలు చేసింది.
ఇక రిటైన్ చేసిన ఆటగాళ్లలో లాకీ ఫెర్గుసన్ , టీమ్ సౌథీ, నితీశ్ రాణా, సునీల్ సరైన్ , ఆండ్రీ రస్సెల్ , హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్ , వెంకటేశ్ అయ్యర్, అనుకుల్ రాయ్ , వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ , రింకూ సింగ్ , రహ్మనుల్లా గుర్బాజ్ , శ్రయేస్ అయ్యర్ (కెప్టెన్) ఉన్నారు.
విడుదల చేసిన ఆటగాళ్లలో రమేష్ కుమార్ , కరుణ రత్నే, ఆరోన్ ఫించ్ , అజింక్యా రహానే, మహ్మద్ నబీ , శివమ్ మావి ఉన్నారు. ఈసారి అయ్యర్ ఫుల్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు బలంగా మారనుంది.
Also Read : టాప్ ప్లేయర్లకు ‘హైదరాబాద్’ ఛాన్స్