KK’S Wife Paint : కేకే నీ చిత్రం అజరామరం – జ్యోతి కృష్ణ
తన భర్త చిత్రాన్ని గీసిన సింగర్ భార్య
KK Wife Paint : భారత దేశ సినీ సంగీతంలో వెల్లువలా వచ్చాడు కేకే. దేశమంతటా తన గాత్రంతో అల్లుకు పోయాడు. తనను అభిమానించే వేలాది మందితో కలిసి పాట పాడి చివరకు ఈ లోకం నుంచి నిష్క్రమించాడు దిగ్గజ గాయకుడు కేకే.
గొంతులో వేదనను పలికించే అరుదైన గాయకులలో ఒకడిగా పేరొందాడు. ఆయన గాయకుడే కాదు అద్భుతమైన చిత్రకారుడు (పెయింటర్ ) కూడా. ఈ సందర్భంగా తనను ప్రాణ ప్రదంగా ప్రేమించిన భార్యతో కలిసి గీసిన చిత్రాన్ని గురువారం పంచుకున్నారు.
ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. తాను వేసిన పెయింటింగ్ ను మరోసారి షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొద్ది సేపటికే వేలాది మంది కేకేను మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు.
ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు. ఇదే సమయంలో నిన్ను మిస్ అవుతున్నానంటూ పేరకొంది జ్యోతి కృష్ణ. ఇదిలా ఉండగా కోల్ కతా లోని నజ్రుల్ మంచా లోని కాలేజీ ఉత్సవంలో తన చివరి కచేరి నిర్వహించాడు కేకే.
మే 31న మరణించాడు. ఆయన వయస్సు 53 ఏళ్లు. మళ్లీ కేకే(KK’S Wife Paint) నిన్ను మరిచి పోలేక పోతున్నా. నీ పెయింట్ వేయాలని ప్రయత్నం చేస్తున్నా. నిజమైన ప్రేమ ఎన్నటికీ చావదంటూ పేర్కొంది.
నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కేకే పాటకు మరణం లేదు. ఆయన ఎల్లప్పటికీ జీవించి ఉంటారంటూ తెలిపారు. మీ సహకారం వల్లనే ఆయన అద్భుతంగా పాడగలిగాడు అంటూ ఓ నెటిజన్ స్పందించాడు.
Also Read : సుశాంత్ కేసులో రియాపై ఛార్జిషీట్