KL Rahul : ఐపీఎల్ 2022లో కొత్త ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు. కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా జరగడం విశేషం. లక్నో సెయింట్స్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్(KL Rahul )కీలక కామెంట్స్ చేశారు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి పోయినా ఆఖరు బంతి వరకు పోరాట పటిమను ప్రదర్శించింది. గుజరాత్ బౌలర్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతమైన బంతులతో సత్తా చాటాడు.
కేఎల్ రాహుల్ తో పాటు డికాక్ ను పెవిలియన్ కు పంపించాడు. కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన ఆయుష్ బదోనితో పాటు హుడా అద్భుతంగా ఆడారు.
ప్రత్యేకించి ఆయుష్ బదోని దుమ్ము రేపాడు. గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ కలిసి ఆడక పోయి ఉంటే లక్నో తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేది.
ఇక లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న బదోనీ ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే దుమ్ము రేపాడు. స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, ఫెర్గూసన్ తో పాటు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు బదౌని.
అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 బంతులు ఎదుర్కొన్న మనోడు 54 రన్స్ చేశాడు. దీంతో బదౌనిని ఆకాశానికి ఎత్తేశాడు కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul ).
తాము ఓడి పోయినా బదౌని సూపర్ గా ఆడాడంటూ కితాబు ఇచ్చాడు. చాలా అనుభవం కలిగిన ఆటగాడిగా క్లాసిక్ షాట్స్ ఆడాడంటూ కితాబు ఇచ్చాడు కెప్టెన్ కేఎల్ రాహుల్.
Also Read : లక్నోపై గుజరాత్ టైటాన్స్ జయభేరి