Kodandaram : కోదండరాంకు కీలక పదవి
ఆకునూరి మురళి..గాదె ఇన్నయ్యకు కూడా
Kodandaram : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాంకు అత్యధిక ప్రాధాన్యత సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కోదండరాం భావ వ్యాప్తికి కృషి చేశారు. సకల జనులను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చారు. సిద్దాంతకర్త దివంగత జయశంకర్ ఆచారితో కలిసి రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించారు.
Kodandaram May be Got a Good Position
కేసీఆర్ దురహంకార పాలనపై పోరాడుతూ వచ్చారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినా ఎక్కడా తగ్గలేదు కోదండరాం(Kodandaram). పోలీసులు దురుసు ప్రవర్తన తెలంగాణ సమాజాన్ని విస్తు పోయేలా చేసింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దమన కాండను ఖండించారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మేనిఫెస్టోలో కీలక మార్పులు చేర్పులు చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చేయడంలో సక్సెస్ అయ్యారు కోదండరాం.
రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరిన వెంటనే తెలంగాణకు చెందిన మేధావులపై ఫోకస్ పెట్టారు. ముందుగా కోదండరాంకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా , ఆకునూరి మురళితో పాటు గాదె ఇన్నయ్యకు కీలక పోస్టులు దక్కనున్నాయి.
Also Read : CM Revanth Reddy : ‘సీఎం’ ముళ్ల కిరీటం