Kodi Katti Case: నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి !
నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి !
Kodi Katti Case: ఏపి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తల్లి సావిత్రి అలియాస్ మరియమ్మ… విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. ఈ కేసులో బాధితుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని(YS Jagan) కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వలన గత ఐదేళ్ళుగా తన కుమారుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గుతున్నాడని… కాబట్టి ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆమె ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో ఈ దీక్ష చేపట్టడానికి పోలీసుల నుండి అనుమతి లభించకపోవడంతో… ఇంట్లోనే ఆమె నిరాహార దీక్షకు పూనుకున్నట్లు స్పష్టం చేసారు. అయితే ఆమెకు సంఘీభావంగా… ఆమె పెద్ద కొడుకు, నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి… నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చే వరకు వారు ఈ నిరాహార దీక్ష కొనసాగించనున్నట్లు తెలిపారు.
Kodi Katti Case Viral
ఈ సందర్భంగా నిందితుడి శ్రీనివాసరావు తల్లి సావిత్రి మీడియాతో మాట్లాడుతూ… కోడికత్తి కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. దీనితో నా కుమారుడు శ్రీనుకి బెయిల్ రాకపోవడం వలన సుమారు ఐదేళ్ల నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నా కుమారుడు శ్రీనివాస్ జైలులో నిరాహార దీక్ష చేపడున్నట్లు నాకు ఫోన్ ద్వారా తెలియజేసాడు. దీనితో నా కుమారుడికి మద్దత్తుగా నేను విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసుల నుండి అనుమతి లభించకపోవడంతో నా ఇంట్లోనే నిరాహార దీక్షకు కూర్చున్నాను.
ఈ కేసులో సీఎం జగన్ న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి బాధితుడు శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యేందుకు సహకరించాలని ఆమె వేడుకున్నారు. అంతేకాదు జైల్లో ఉన్న శ్రీనుకు ఏదైనా హాని జరిగితే దానికి సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చేందుకు కోడికత్తి కేసును బాగా వాడుకున్నారని, సీఎం అయిన తర్వాత ఆయనను కలిసి తమ ఆవేదన తెలియజేసేందుకు అనేకసార్లు ప్రయత్నించినాఫలితం లేకపోయిందని ఆమె వాపోయారు. ప్రాణం ఉన్న అంబేద్కర్ వారసుడిని జైల్లో నిర్బంధించి ప్రాణం లేని 125 అడుగుల అంబేత్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహమని అని కోడి కత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి విజయవాడ నందు కొలువై ఉన్న కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
Also Read : Wings India 2024: బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా-2024’ ఏవియేషన్ షో ప్రారంభం !