Kohli Ganguly Memes : నెట్టింట్లో కోహ్లీ గంగూలీ మీమ్స్ వైర‌ల్

గంగూలీ పై కొన‌సాగుతున్న సెటైర్లు

Kohli Ganguly Memes : సౌర‌వ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ గా త‌న ముగింపును ధ్రువీక‌రించిన త‌ర్వాత విరాట్ కోహ్లీ మీమ్(Kohli Ganguly Memes) ల‌తో సోష‌ల్ మీడియా నిండి పోయింది. దీనికి అద్బుత‌మైన క్యాప్ష‌న్ కూడా పెట్టింది. క‌ర్మ తిరిగి కొట్టింది. ప్ర‌స్తుతం బీసీసీఐ కార్య‌వ‌ర్గం అక్టోబ‌ర్ 18న కొలువు తీర‌నుంది. ఇప్ప‌టికే ఎవ‌రెవ‌రు ఉండాలో కూడా కొలిక్కి వ‌చ్చిద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీసీసీఐ అధ్య‌క్షుడి ప‌ద‌వీ కాలం గంగూలీ ముగిసింది. రెండోసారి కేంద్ర మంత్రి అమిత్ షా త‌న‌యుడు జే షా ఎన్నిక కానున్నారు. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోద‌రుడు త‌రుణ్ సింగ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మ‌న్ అవుతార‌ని టాక్. రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్ కానుండ‌గా మాజీ ఆల్ రౌండ‌ర్ రోజ‌ర్ బిన్నీ ప్ర‌స్తుతం సౌర‌వ్ గంగూలీ స్థానంలో కొలువు తీర‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా బంధ‌న్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితుల‌య్యారు సౌర‌వ్. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు గంగూలీ. తాను ఎక్కువ కాలం అడ్మినిస్ట్రేట‌ర్ గా ఉండ‌లేన‌ని పేర్కొన్నారు. ఆట‌గాడిగా స‌క్సెస్ అయ్యాను. అయితే బీసీసీఐ చీఫ్ గా తాను ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నాన‌నేది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూ ఉంటార‌ని చెప్పాడు.

ఈ త‌రుణంలో త‌న హ‌యాంలో కోహ్లీ త‌ప్పుకునేందుకు కార‌ణ‌మ‌య్యార‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. కోహ్లీకి స‌పోర్ట్ గా అభిమానులు మీమ్స్ ..పోస్టుల‌తో హోరెత్తుతోంది.

వ‌న్డే బాధ్య‌త‌ల నుండి తొల‌గించ‌బ‌డిన ఒక నెల త‌ర్వాత టెస్టు కెప్టెన్సీ నుండి వైదొల‌గాల‌ని కోహ్లీ తీసుకున్న నిర్ణ‌యానికి దారి తీసిన 33 ఏళ్ల , గంగూలీ మ‌ధ్య జ‌రిగిన మొత్తం ఎపిసోడ్ ను విరాట్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

Also Read : ఎప్ప‌టికీ అడ్మినిస్ట్రేట‌ర్ గా ఉండ‌లేను

Leave A Reply

Your Email Id will not be published!