Konidela Nagababu: ‘ఎక్స్’ లోనికి నాగబాబు రీ ఎంట్రీ !

'ఎక్స్' లోనికి నాగబాబు రీ ఎంట్రీ !

Konidela Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు(Konidela Nagababu) ఇటీవల తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్… తన స్నేహితుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అల్లు అర్జున్ మేనమామ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కేవలం ఎక్స్ ద్వారా మద్దత్తు తెలిపి… తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్ధి ఇంటికి వెళ్ళడం పలు విమర్శలకు దారి తీసింది.

Konidela Nagababu in..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు… పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశ్యించి ప్రత్యర్ధికి సహకరించిన వాడు మావాడైనా పరాయివాడే… మనకు సహకరించిన వాడు పరాయివాడైనా మావాడేనంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శల దాడి చేసారు. ఆ క్రమంలో అల్లు రామలింగయ్య లేకుంటే.. నాగబాబు ఉండేవాడు కాదు.. సైకిళ్లకు పంక్చర్ వేసుకొనే వాడంటూ.. అల్లు అర్జున్ పేరుతో ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనితో నాగబాబు రెండు రోజుల క్రితం ఎక్స్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసారు. అయితే ఏమైందో ఏమోగాని తాజాగా మరల నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ను యాక్టివేట్ చేసి రీ ఎంట్రీ ఇచ్చారు. దీనితో ఏపీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.

Also Read : Special Investigation Team: రంగంలోనికి దిగిన సిట్‌ బృందం ! తిరుపతి చేరుకున్న సిట్ అధికారులు !

Leave A Reply

Your Email Id will not be published!