Konidela Nagababu: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు

Konidela Nagababu : ఏపీ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన నేత కొణిదెల నాగేంద్ర బాబు(Konidela Nagababu), బీజేపీ నేత సోము వీర్రాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు. మండలి చైర్మెన్ మోషేన్ రాజు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా కొణిదెల నాగేంద్రబాబు(Konidela Nagababu) సతీ సమేతంగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం నాగబాబు… సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసారు.

Konidela Nagababu Oath Ceremony

ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి, ఇతర నాయకులు శాలువా, పూలదండలతో సోము వీర్రాజును సత్కరించారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ… సోము వీర్రాజు(Somu Veeraju) రెండో సారి ఎమ్మెల్సీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది‌ బీజేపీలో ఒక చారిత్రక విషయంగా ఆయన పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకు అవకాశం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఎమ్మెల్సీ సీటు బీజేపీకి కేటాయించారన్నారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసిన సోము వీర్రాజు సేవలను అధిష్టానం గుర్తించిందన్నారు.

అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువుగా ఉన్నా… మండలిలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారన్నారు. పెద్దల సభలో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, మండలిలో మన వాణిని వినిపించి, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. కేంద్ర పెద్దలు సోము వీర్రాజు గళం విప్పుతారనే నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేశారన్నారు. ఏపీలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని, ప్రభుత్వంలో జరిగే మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటు కింద స్థాయిలో జరిగే లోపాలను ప్రభుత్వం దృష్టికి బీజేపీ తీసుకెళుతుందన్నారు. ప్రతి బూత్‌లో కూడా కమిటీలు వేసుకుని… ఏపీలో అన్ని విధాలా పార్టీ బలంగా తయారవుతుందని ఎమ్మెల్యే పార్ధసారధి వ్యాఖ్యానించారు.

Also Read : Nagavali Express: విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

Leave A Reply

Your Email Id will not be published!