Kothakota Srinivas Reddy : డ్రగ్స్ పై ఉక్కుపాదం – సీపీ
కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
Kothakota Srinivas Reddy : హైదరాబాద్ – హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా కొలువు తీరిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. డగ్స్ లేని నగరంగా తయారు చేయడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం సీపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉంటామని ఇదే సమయంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో తలతిక్క వేషాలు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
Kothakota Srinivas Reddy Comment
ఇక నుంచి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే డ్రగ్స్ ను ప్రోత్సహించినా లేదా వాడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు.
విధి నిర్వహణలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పాలని, వాటిని సర్దుకుంటామని అన్నారు సీపీ. తన శక్తి సామర్థ్యాలు ఏమిటో గుర్తించి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. గతంలో కంటే మెరుగైన రీతిలో పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు.
ఇక నుంచి హైదరాబాద్ లో డ్రగ్స్ , జూదం అన్నది లేకుండా చేస్తానని ప్రకటించారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందన్నారు . ప్రజాభిప్రాయాన్ని తమకు మీ మీడియా ద్వారా తెలియ చేయాలని కోరుతున్నామన్నారు. మహిళా వేధింపులు, ర్యాగింగ్ లకు చెక్ పెడతామన్నారు. వెంటనే తాము స్పందిస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందజేస్తామని చెప్పారు.
Also Read : Telangana Speaker : స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్