Krishna Priya : నారాయ‌ణ‌, త‌మ్ముడిపై కృష్ణ ప్రియ ఫిర్యాదు

రాయ‌దుర్గంలో పోలీస్ స్టేషన్లో కంప్లైట్

Krishna Priya : తెలుగుదేశం పార్టీ అగ్ర నేత‌, మాజీ మంత్రి , నారాయ‌ణ సంస్థ‌ల చైర్మ‌న్ నారాయ‌ణ‌పై , ఆయ‌న త‌మ్ముడు సుబ్ర‌మ‌ణ్యంపై పొంగూరు కృష్ణ ప్రియ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా వీడియోను విడుద‌ల చేశారు. ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మ‌రాయి. త‌న‌ను గ‌త కొంత కాలం నుంచి పొంగూరు నారాయ‌ణ వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ వాపోయింది. ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇబ్బందిక‌రంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆరోపించింది.

Krishna Priya Comments

ఇదిలా ఉండ‌గానే మ‌రో వైపు పోలీసు స్టేష‌న్ ను ఆశ్ర‌యించింది. ఆదివారం హైద‌రాబాద్ లోని రాయదుర్గం పోలీస్ ఠాణాకు పొంగూరు కృష్ణ ప్రియ(Krishna Priya) వెళ్లింది. అక్క‌డ త‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశారంటూ మాజీ మంత్రి నారాయ‌ణ‌, ఆయ‌న త‌మ్ముడు, త‌న భ‌ర్త అయిన సుబ్ర‌మ‌ణ్యంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ మేర‌కు పోలీస్ స్టేష‌న్ లో ఎస్ఐ కి ఫిర్యాదు అంద‌జేసింది. క్రిమిన‌ల్ కంప్లైంట్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు రాయ‌దుర్గం పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా పొంగూర క్రిష్ణ ప్రియ ఉన్న‌ట్టుండి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో క‌థ మ‌రో మ‌లుపు తిరిగింది. నారాయ‌ణ గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ఉన్నారు. మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

Also Read : Trivikram Srinivas Mahesh Babu : మహేష్ 24 ఏళ్ల‌ సినీ ప్రయాణం – త్రివిక్ర‌మ్

Leave A Reply

Your Email Id will not be published!