హైదరాబాద్ : మిర్యాలగూడ వేదికగా జరగిన బహిరంగ సభలో తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గరువారం కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి సిగ్గు పడుతోందన్నారు. అయినా సోయి లేకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడటం దారుణమన్నారు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. మెదడులో చిప్ దొబ్బినట్టు ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవని కేవలం వచ్చేది మాత్రం మురికి భాష తప్ప మరోటి రాదన్నారు.
హార్వర్డ్ యూనివర్శిటీలో ఐదు రోఉలు కాదు 500 రోజుల పాటు కోర్సులు చేసినా రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం మారదన్నారు. బూతు భాష తప్పా తనకు ఏదీ రాదన్నారు. ఎన్ని కోర్సులు చదివితే ఏం లాభం. సంస్కారం అనేది లేక పోతే అని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి, ఉద్యమాల్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ ను ఉద్దేశించి వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర స్తాయిలో మండిపడ్డారు కేటీఆర్. ప్రజలు నిన్ను క్షమించరని, రాబోయే రోజుల్లో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే రేపొద్దున పవర్ పోయే రోజు తప్పకుండా వస్తుందన్నారు.