చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులతో అలరారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈనెలలో శివ రాత్రి పర్వదినం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఇదిలా ఉండగా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలిశారు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్. ఈ సందర్భంగా పూజారులు ఆశీర్వచనం అందజేశారు పవన్ కళ్యాణ్ కు. అనంతరం సాయి ప్రసాద్ దేవాలయ కమిటీ తరపున పవన్ కు ఆహ్వాన పత్రికను ఇచ్చారు.
శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆలయ కమిటీ చైర్మన్. ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలని కోరారు. మీరు గెలవాలని ప్రార్థనలు కూడా చేశామన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.
