సంజూ శాంస‌న్ క్లాస్ శాశ్వ‌తం : శ‌శి థ‌రూర్

ఫామ్ అనేది తాత్కాలికం అన్న కాంగ్రెస్ ఎంపీ

కేర‌ళ : త‌మ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై స్పందించారు తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్. ఆదివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. తాజాగా స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన టి20 సీరీస్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా కేవ‌లం మొత్తం సీరీస్ ఆడినా శాంస‌న్ కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నాడు. త‌ను చూసిన క్రికెట‌ర్ల‌లో త‌న‌కు ఇష్ట‌మైన వారిలో శాంస‌న్ టాప్ లో ఉంటాడ‌ని తెలిపాడు. అయితే ఆట , క్లాస్ అనేది శాశ్వ‌తం అన్నాడు. ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ నుంచి నెంబ‌ర్ 10 దాకా పేరు పొందిన ఆట‌గాళ్లంతా ఏదో ఒక సారి ఫామ్ కోల్పోయిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌న్నాడు శ‌శి థ‌రూర్.

త‌న‌కు పూర్తిగా సంజూ శాంస‌న్ ఫామ్ పై న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. త‌ను ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడ‌టం త‌ప్ప‌ద‌న్నాడు ఎంపీ. ప్ర‌స్తుతం త‌న‌కు బ్యాడ్ ల‌క్ స్టార్ట్ అయ్యింద‌ని, ఇది కొంత కాలం మాత్ర‌మే ఉంటుందన్నాడు. ఇదిలా ఉండ‌గా తిరువ‌నంత‌పురం లో జ‌రిగిన మ్యాచ్ లో శాంస‌న్ కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇషాన్ కిష‌న్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. దీంతో హెడ్ కోచ్ గంభీర్ ఇషాన్ కిష‌న్ ను వికెట్ కీప‌ర్ గా ప్ర‌మోట్ చేశాడు. త‌న స్థానం నుంచి త‌ప్పించారు శాంస‌న్ ను. త‌న‌ను కేవ‌లం గ్రౌండ్ లో ఆట‌గాడిగా మాత్ర‌మే ఉప‌యోగించు కున్నాడు. దీంతో రాబోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో శాంస‌న్ కు చోటు లేద‌ని తేలి పోయింది.

Leave A Reply

Your Email Id will not be published!