KTR : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని , అయితే తాము పడగొడుతున్నామని వస్తున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ మంత్రి కేటీఆర్.
KTR Comment
మంగళవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ ఒక్కరిని కొనుగోలు చేసే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత అనేక వర్గాల ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం అవుతుందోన్నారు. కేసీఆర్ తిరిగి సీఎంగా ఉంటే బాగుండు అన్న భావనను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తనతో పాటు తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ప్రజా తీర్పును గౌరవిస్తామని పేర్కొన్నారు కేటీఆర్(KTR). కొత్తగా ఏర్పాటు కాబోయే కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు సహకరిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. హుందాగా, విజ్ఞతతో వ్యవహరిస్తామని తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా అనవసరమైన ఫేక్ ప్రచారాలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ పరంగా గెలుపొందిన వారిని తాము సంప్రదించ లేదన్నారు. వారిని కొనుగోలు చేసే శక్తి తమకు లేదని చెప్పారు.
Also Read : Bhatti Vikramarka Mallu : భట్టికి డిప్యూటీ సీఎం ..?