Konda Surekha Yashaswini Reddy : బైబై కేసీఆర్..బైబై క‌విత

కొండా సురేఖ‌..య‌శ‌స్విని వైర‌ల్

Konda Surekha Yashaswini Reddy : హైద‌రాబాద్ – తెలంగాణలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సంచ‌లనంగా మారారు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మ‌హిళా నాయ‌కురాళ్లు. ఒక‌రు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన కొండా సురేఖ(Konda Surekha) అయితే మ‌రొక‌రు ఎన్నారైగా విశిష్ట సామాజిక సేవ‌లు అందించిన 26 ఏళ్ల య‌శ‌స్విని రెడ్డి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ లోని ఎల్లా హోట‌ల్ లో బ‌స చేశారు. వీరికి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ , మాజీ మంత్రి చిన్నారెడ్డి శిక్ష‌ణ ఇచ్చారు.

Konda Surekha Yashaswini Reddy Shocking Comments

హోట‌ల్ లో ఈ ఇద్ద‌రు టిఫిన్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బైబై కేసీఆర్..బైబై క‌విత అంటూ ఎద్దేవా చేస్తూ చెప్ప‌డం ఇప్పుడు సెన్సేష‌న్ గా మారింది. విజ‌యం సాధించిన ఉత్సాహం వీరిలో క‌నిపించింది. ఇద్ద‌రినీ ఓడించేందుకు బీఆర్ఎస్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేసింది.

విచిత్రం ఏమిటంటే త‌న‌కు ఎదురే లేద‌ని భావిస్తూ అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ, దాడుల‌కు తెగ బ‌డిన మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు చుక్క‌లు చూపించింది య‌శ‌స్విని రెడ్డి. ఆమె ఛాలెంజ్ చేసింది. త‌న‌ను ఓడిస్తాన‌ని అన్న మాట ప్ర‌కారం భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మొత్తంగా ఓరుగల్లు జిల్లాకు చెందిన మ‌రొక‌రు సీత‌క్క కూడా గెలుపొందారు.

Also Read : KTR : ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టం స‌హ‌క‌రిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!