Revanth Reddy Comment : మామూలోడు కాదు బుల్లెట్ లాంటోడు

తెలంగాణ సీఎంగా పాల‌మూరు బిడ్డ

Revanth Reddy Comment : దొర‌ల గ‌డీల పాల‌న నుంచి తెలంగాణ‌ను విముక్తం చేస్తానంటూ ప్ర‌క‌టించిన వాడు. అన్న‌ట్టు చెప్పిన‌ట్టు చేసి చూపించాడు. ఉద్య‌మ నేత‌గా త‌న‌కంటూ ఎదురే లేద‌ని విర్ర‌వీగుతూ వ‌చ్చిన క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన వాడు. త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసి, జైలు పాలు చేసినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. బంతి లాగా తిరిగి వ‌చ్చాడు. బుల్లెట్ లాగా త‌యార‌య్యాడు. కేసీఆర్ క‌ల‌లో కూడా అనుకోని ఉండ‌డు. త‌నంత‌కు తాను రాజీనామా చేసి వెళ‌తాన‌ని. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా వ‌చ్చిన పేరును త‌నంత‌కు తానుగా చెరిపేసుకున్నాడు. అలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పోరాటాల పురిటి గ‌డ్డగా పేరు పొందిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం స్వ‌స్థలం. తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డికి బంధువు. మ‌ధ్య త‌ర‌గ‌తి రైతు కుటుంబం నుంచి వ‌చ్చారు.

Revanth Reddy Comment Viral

త‌న జీవ‌న ప్ర‌స్థానంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నారు. అంత‌కు మించి ఇబ్బందులు ప‌డ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు త‌న కూతురి పెళ్లికి కూడా బెయిల్ పై వ‌చ్చి అటెండ్ అయ్యారు. జెడ్పీటీసీగా తొలిసారి గెలుపొందారు. అక్క‌డి నుంచి నేటి వ‌ర‌కు వెనుదిరిగి చూడ‌లేదు. ఆ వెంట‌నే ఎమ్మెల్సీ అయ్యాడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). టీడీపీలో చేరి త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం క‌ల్వ‌కుర్తి కాకుండా క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఉన్న కోడంగ‌ల్ కు వెళ్లాడు. అక్క‌డ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను హ‌త్తుకున్నారు. ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో ఘ‌న విజ‌యాన్ని సాధించాడు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యాడు. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పాడు. వెంట‌నే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అక్క‌డ పార్టీ రేవంత్ రెడ్డికి ఎంపీ సీటు ఇచ్చింది. ఓ వైపు ఎమ్మెల్యేగా ఓడి పోయిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎంపీగా మ‌ల్కాజ్ గిరి నుంచి గెలుపొందాడు.

కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజ‌న్ లాగా మారాడు రేవంత్ రెడ్డి. గ‌త రెండేళ్లుగా పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. నిర్బంధ , రాక్ష‌స‌, గ‌ఢీల పాల‌న సాగిస్తున్న కేసీఆర్ ప‌క్క‌న బ‌ల్లెంలా మారాడు. ఎన్నో ఆరోప‌ణ‌లు, మ‌రెన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. మొత్తంగా కాంగ్రెస్(Congress) పార్టీకి విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఎంద‌రో సీనియ‌ర్ నేత‌లు ఉన్నా పార్టీ హైక‌మాండ్ రేవంత్ రెడ్డిపై న‌మ్మ‌కాన్ని ఉంచింది. ఊహించ‌ని విధంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశాడు. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హొరెత్తించాడు. త‌ను అనుకున్న‌ది సాధించేంత వ‌ర‌కు నిద్ర పోనంటూ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే ప్ర‌క‌టించాడు. ఆరు నూరైనా స‌రే త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. దీంతో ఇంత కాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆధిప‌త్యం చెలాయించిన గులాబీ నేత‌ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేశాడు రేవంత్ రెడ్డి. మొత్తంగా త‌ను మామూలోడిని కాద‌ని బుల్లెట్ లాంటోడిన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. సీఎంగా కొలువు తీరాడు. ఎట్ట‌కేల‌కు పంతం నెగ్గించుకున్నాడు.

Also Read : Congress CM Comment : సీఎం ఎంపిక‌పై బిగ్ ట్విస్ట్

Leave A Reply

Your Email Id will not be published!