KTR Lu Lu Group : ‘లులు’ గ్రూప్ రూ. 3,500 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ లో ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్
KTR Lu Lu Group : ప్రపంచంలో పేరు పొందిన లు లూ గ్రూప్ ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు లులూ గ్రూప్ సంస్థల చైర్మన్ యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్ తో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ రంగాలలో లు లూ గ్రూప్ ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుందని ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్.
లు లు ప్రధాన కార్యాలయం అబు దాబిలో ఉంది. మొత్తం 238 స్టోర్స్ ఉన్నాయి. ఈ కంపెనీని 2000లో స్థాపించారు. యూసుఫ్ అలీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 7.4 బిలియన్ల ఆదాయం కలిగి ఉంది. లు లు(Lu Lu Group) కంపెనీలో వరల్డ్ వైడ్ గా 57,000 మంది పని చేస్తున్నారు. ఈ కంపెనీ హైపర్ మార్కెట్ , రిటైల్ స్టోర్స్ ను కలిగి ఉంది.
యూసుఫ్ అలీ ఎవరో కాదు భారతీయుడు. ఆయన కేరళ లోని త్రిస్సూర్ జిల్లా నట్టిక నుండి లు లు సంస్థను స్థాపించారు. ఆసియా లోనే అతి పెద్ద రిటైల్ చైన్ లలో ఒకటిగా పేరు పొందింది. కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో పాటు ఇతర దేశాలలో కూడా విస్తరించి ఉంది. భారత దేశంలో 3 అతి పెద్ద మాల్స్ కలిగి ఉంది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ డెలాయిట్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అభివృద్ది చెందుతున్న కంపెనీలలో లులు ఒకటి అని పేర్కొంది.
Also Read : KTR Teleperformance : హైదరాబాద్ లో టెలిపర్‌ఫార్మెన్స్ స్టార్ట్