KTR : మునుగోడులో గులాబీదే విజ‌యం – కేటీఆర్

రెండో ప్లేస్ లో కాంగ్రెస్..మూడో స్థానంలో బీజేపీ

KTR : మునుగోడు ఉప ఎన్నిక‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మంత్రి కేటీఆర్. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు త‌మ అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ రెడ్డిని గెలిపించ‌డం ఖాయ‌మ‌న్నారు. తాము బంప‌ర్ మెజారిటీతో గెలుస్తామ‌ని ఇక రెండ‌వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి నిలుస్తుంద‌న్నారు.

ఇక కేవ‌లం కాంట్రాక్టు కోసం బీజేపీలోకి చేరి ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గ్రాఫ్ ప‌డి పోయింద‌న్నారు. ఆయ‌న‌కు మూడో ప్లేస్ ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్(KTR) . తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు. కేవలం బ‌లుపుతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌గా అభివ‌ర్ణించారు కేటీఆర్.

ఎనిమిది సంవ‌త్స‌రాల కాలంలో కేంద్రంలో బీజేపీ స‌ర్కార్ ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉందో లేదోన‌న్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ ఇప్పుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మ‌గా మారింద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ప్ర‌క‌టించిందో ఆనాడే ఆ పార్టీ క్లోజ్ అయ్యింద‌న్నారు.

ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ఆయ‌న‌కు మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. గుజ‌రాత్ లో ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఇక్క‌డ రాహుల్ గాంధీ పాద‌యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆ పార్టీ చెప్పాల‌న్నారు. బ్రిట‌న్ లో ప్ర‌ధాని ఆత్మాభిమానంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని కానీ ఆ సోయి ప్ర‌ధాన‌మంత్రి మోదీకి లేద‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్.

Also Read : అన్న కాదు నాన్న నా రోల్ మోడ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!