KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాని మోదీని, హోం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బేషరతుగా మహిళా రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. లైంగికంగా , మానసికంగా, శారీరకంగా తాము ఇబ్బందులకు గురవుతున్నట్లు సాక్షాత్తు రెజ్లర్లు ఆరోపణలు చేస్తున్నా ఎందుకు మోదీ, షా మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు.
అసలు ఈ దేశంలో క్రీడా శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అంతే కాదు తాము లై డిటెక్టర్ , నార్కో టెస్ట్ కు సిద్దంగా ఉన్నామని మహిళా రెజ్లర్లు ప్రకటించారని మరి ఎందుకు రెజర్ల సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆయనను ఎందుకు రక్షిస్తున్నారో, ఎందుకు వెనకేసుకు వస్తున్నారో దేశ ప్రజలకు మోదీ, షా, అనురాగ్ ఠాకూర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.
అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వాళ్లు రేయింబవళ్లు కష్టపడి ప్రయత్నం చేస్తే పతకాలు వచ్చాయని మాయ మాటలు చెబితే రాలేదని మోదీ గుర్తు పెట్టుకోవాలన్నారు. పతకాలు సాధించిన వారితో ఫోటోలు దిగేంత శ్రద్ద బాధితుల సమస్యను పరిష్కరించడంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.
Also Read : NMC