NMC : 150 కాలేజీల‌కు గుర్తింపు క‌ష్ట‌మే

దేశ వ్యాప్తంగా త‌నిఖీల్లో వెల్ల‌డి

NMC : దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన త‌నిఖీల్లో దాదాపు 150కి పైగా మెడిక‌ల్ కాలేజీలు స‌రైన నిర్వ‌హ‌ణ‌, ప్రామాణిక‌త‌ను పాటించ‌డం లేద‌ని తేలిన‌ట్లు స‌మాచారం. ఎన్ఎంసీకి(NMC) సంబంధించిన వైద్య కాలేజీల జాబితాలో గుజ‌రాత్ , అస్సాం, పుదుచ్చేరి, త‌మిళ‌నాడు, పంజాబ్ , ఆంధ్ర ప్ర‌దేశ్ , త్రిపుర‌, ప‌శ్చిమ బెంగాల్ లు ఉన్నాయి. దేశంలోని వైద్య విద్య‌, వైద్య నిపుణుల నియంత్ర‌ణ సంస్థ , నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ , ఫ్యాక‌ల్టీ స‌రిగా లేక పోవ‌డం, నిబంధ‌న‌ల‌ను పాటించ‌క పోవ‌డం వ‌ల్ల గుర్తింపును కోల్పోయే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే 40 మెడిక‌ల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయి. అవి నిర్ణీత ప్ర‌మాణాల‌ను పాటిస్తున్నాయ‌ని ఎన్ఎంసీకి చూపించాల్సి ఉంటుంది. క‌మీష‌న్ కు చెందిన అండ‌ర్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యూకేష‌న్ బోర్డు నెల రోజుల పాటు నిర్వ‌హించిన త‌నిఖీలో లోపాలు వెల్ల‌డ‌య్యాయి. దీనిలో వారు సీసీ టీవీ కెమెరాలు, ఆధార్ లింక్డ్ బ‌యో మెట్రిక్ హాజ‌రు విధానాలు, ఫ్యాక‌ల్టీ రోల్స్ లోని లోపాల‌ను ప్ర‌ధానంగా ప‌రిశీలించారు.

స‌రైన కెమెరా ఇన్ స్టాలేష‌న్ , వాటి ప‌నితీరుతో స‌హా మెడిక‌ల్ కాలేజీని నిర్వ‌హించేందుకు కాలేజీలు ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అధ్యాప‌కుల్లో చాలా పోస్టులు కూడా ఖాళీగా ఉన్న‌ట్లు త‌నిఖీల్లో గుర్తించారు. అయితే మెడిక‌ల్ కాలేజీల‌కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంద‌ని, అది 30 రోజుల వ‌ర‌కే ఉంటుంద‌ని పేర్కొంది. ఒక‌వేళ అప్పీలు తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ను ఆశ్ర‌యించాల్సి ఉంటుంది.

Also Read : Sanjay Raut

Leave A Reply

Your Email Id will not be published!