KTR Teleperformance : హైదరాబాద్ లో టెలిపర్‌ఫార్మెన్స్ స్టార్ట్
వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
KTR Teleperformance : తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా మరో సంస్థ హైదరాబాద్ లో కొత్తగా డిజిటల్ సేవలను ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా దేశంలోనే భాగ్యనగరం ఎక్కువగా ఐటీ, లాజిజిస్టిక్, ఫార్మా కంపెనీలను ఆకర్షిస్తోంది. వేలాది మందికి ఆయా కంపెనీల ద్వారా ఉపాధి దొరుకుతోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ తన బృందంతో కలిసి అమెరికా, లండన్ లలో పర్యటించారు.
ఆయా కంపెనీల ప్రతినిధులు, చైర్మన్లు, సిఇవోలతో సంభాషించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ మేరకు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ కు కూడా ఢోకా లేదని భరోసా ఇచ్చారు. దీంతో దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాయి.
ఈ సందర్భంగా సంతోషకరమైన వార్తను తాను పంచుకుంటున్నట్లు తెలిపారు కేటీఆర్(KTR). టెలిపర్‌ఫార్మెన్స్ అనే ఫ్రెంచ్ డిజిటల్ సేవల సంస్థ హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తోందని వెల్లడించారు. సదరు కంపెనీ ఏర్పాటు వల్ల భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
దాదాపు 3,000 వేల మందికి పైగా వివిధ వృత్తి నైపుణ్యాలను కలిగిన వారికి జాబ్స్ రానున్నాయని స్పష్టం చేశారు కేటీఆర్. ఆయా కంపెనీలకు సంబంధించి ప్లాన్స్ కూడా రూపొందించామని తెలిపారు. టైర్ 2 పట్టణాల్లో కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత తెలిపారని చెప్పారు. వచ్చే జూలై నెలలో ఇది స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు.
Also Read : KCR Tour : పండరీపురానికి కేసీఆర్ పయనం