Kunki Elephants: కర్ణాటక నుండి ఏపీ కి కుంకీ ఏనుగులు వచ్చేస్తూన్నాయి

కర్ణాటక నుండి ఏపీ కి కుంకీ ఏనుగులు వచ్చేస్తూన్నాయి

చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి వస్తున్నా ఏనుగుల తరిమేయడనికి కర్ణాటక లో ఉన్నా కుంకి ఏనుగుల కోసం కర్ణాటక – ఏపీ ప్రభుత్వల మద్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది.

చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేలా కుంకీ ఏనుగులు తేవాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చించగానే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 23 శాతం అటవీ ప్రాంతం ఉందని.. ఇది 50 శాతానికి పెంచాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అటవీ శాఖ నిర్వహిస్తున్న క్యాంపులో ఉన్న ఏనుగులు వయసు మీరిన కారణంగా ఇబ్బందులు ఎదురువుతున్నాయని వివరించారు. అందుకే అదనంగా కొన్ని కుంకీ ఏనుగులు పంపాలని కర్ణాటకను కోరామన్నారు. వీటి ద్వారా ఏపీలోని చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల సమస్యను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు.

‘‘సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి సమస్యలు సంయుక్తంగా ఎదుర్కోవాల్సి ఉంది. అటవీ అంశాలతో పాటు రాష్ట్రాల మధ్య సరిహద్దు సవాళ్లు చాలా ఉన్నాయి.. వాటిని పరిష్కరించుకోవాలి. అటవీ సంరక్షణలో కర్ణాటక ఐటీని కూడా విస్తృతంగా వినియోగిస్తోంది. పర్యటకంగానూ అటవీ ప్రాంతాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించేలా ఇరు రాష్ట్రాలు పని చేయాల్సి ఉంది’’ అని పవన్‌ తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!