Kyle Mayers : మెరిసిన కైల్ మేయ‌ర్స్

రాణించిన స్టోయినిస్ ..పూర‌న్

Kyle Mayers : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో 26వ మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. రాజ‌స్థాన్ లోని జైపూర్ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కేర‌ళ స్టార్ కెప్టెన్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వ్యూహం ఫ‌లించింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. రాజ‌స్థాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

దీంతో ల‌క్నో ప్లేయ‌ర్లు 7 వికెట్లు కోల్పోయి 154 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ 32 బంతులు ఆడి 39 ర‌న్స్ చేశాడు. ఇక జ‌ట్టులో కీల‌క ఆట‌గాడైన కైల్ మేయ‌ర్స్(Kyle Mayers) హాఫ్ సెంచ‌రీతో స‌త్తా చాటాడు. 42 బంతుల్లో 51 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి మెరుగైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. లేక పోతే 100 ర‌న్స్ లోపే ఉండేది స్కోర్ బోర్డు.

వీరు ఔట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన మార్క‌స్ స్టోయినిస్ 16 బంతులు ఎదుర్కొని 21 ర‌న్స్ చేస్తే నికోల‌స్ పూర‌న్ 20 బాల్స్ ఎదుర్కొని 28 ర‌న్స్ చేశాడు. ఈ న‌లుగురు మిన‌హా ఏ ఒక్క‌రూ రాణించ‌లేక పోయారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు, జాస‌న్ హోల్డ‌ర్, ట్రెంట్ బౌల్ట్ , సందీప్ శ‌ర్మ చెరో వికెట్ తీశారు. ఇక ల‌క్నో సూప‌ర్ కింగ్స్ 5 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. 2 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

Also Read : ల‌క్నో చేతిలో రాజ‌స్తాన్ విల‌విల

Leave A Reply

Your Email Id will not be published!