Laapataa Ladies: సుప్రీంకోర్టులో అమీర్ ఖాన్ మాజీ భార్య ‘లాపతా లేడీస్‌’ సినిమా ప్రదర్శన !

సుప్రీంకోర్టులో అమీర్ ఖాన్ మాజీ భార్య ‘లాపతా లేడీస్‌’ సినిమా ప్రదర్శన !

Laapataa Ladies: దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం మరో అరుదైన సందర్భానికి వేదిక అయింది. బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌(Laapataa Ladies)’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రదర్శించారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు.

Laapataa Ladies…

సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్‌’ సినిమాను ప్రదర్శించనున్నట్లు ఓ సర్క్యులర్‌ విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌, దర్శకురాలు కిరణ్‌ రావ్‌ కూడా రానున్నట్లు అందులో పేర్కొన్నారు.

హ్యూమర్ డ్రామాగా కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమాను రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండే కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నితాన్షి గోయల్, ప్రతిభా రాంటా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ మొదలగువారు నటించారు. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా ఫిల్మ్‌… ఈ ఏడాది మార్చిలో విడుదలై సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా విడుదలకు ముందుగానే సెప్టెంబరు 8న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ప్రదర్శించారు.

Also Read : Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళన కు కీలక ఉత్తర్వులు జారీచేసిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!