Lal Salaam Rajinikanth : ‘లాల్ సలామ్’ రజనీకాంత్
కూతురు ఐశ్వర్య దర్శకత్వం
Lal Salaam Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత తన దర్శకత్వ వెంచర్ లాల్ సలామ్ తో తిరిగి వస్తోంది. చిత్ర నిర్మాత , లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం గురించి పరిచయం చేశారు. తొలిసారిగా ఈ మూవీకి సంబంధించి రజనీకాంత్ పాత్రతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
తలైవా రజనీకాంత్ పోస్టర్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. మొయిదీన్ భాయ్ గా రజనీకాంత్(Lal Salaam Rajinikanth) పలకరించ బోతున్నాడు. అద్భుతంగా ఉండడంతో పోస్టర్ కు భారీ ఎత్తున లైక్ లు, కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే నటనా పరంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్న తలైవా గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ చిత్రంలో విష్ణు విశాల్ , విక్రాంత్ కూడా టైటిల్ పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ లుక్ కుర్తా, ఎరుపు రంగు టోపీని ధరించారు. మొయిదీన్ భాయ్ స్వాగతం మీ గుండె పరుగుతుంటే ఇంకే క్యాప్షన్ పెట్టగలమా అంటూ కోట్ చేసింది ఐశ్వర్య రజనీకాంత్. నటనలో అత్యున్నత స్థానంలో ఉన్న మీకు ఎవరైనా కామెంట్ పెట్టగలరా అంటూ పేర్కొంది కూతురు.
ఇదిలా ఉండగా ఐశ్వర్య, ధనుష్ విడి పోయారు. ఆమె ఇప్పుడు మూవీస్ పై ఫోకస్ పెడుతోంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : ది కేరళ స్టోరీని ప్రతి ఒక్కరు చూడాలి