Ramiz Raja Babar Lata : నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ మృతి చెందడం అత్యంత బాధకు గురి చేసిందన్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రజా. పాకిస్తాన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
సంగీత శిఖరాన్ని అధిరోహించిన ధీర వనిత ఆమె అని ప్రశంసించారు రమీజ్ రజా(Ramiz Raja Babar Lata). ఆమె ఓ ఐకాన్ అని కొనియాడారు. లతా దీదీ స్వరం దైవ స్వరూపం అని ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అంతే కాకుండా మీడియాతో కూడా మాట్లాడారు. ఎన్నో వేల పాటలను అలవోకగా పాడారని, ఆ పాటలన్నీ ఇప్పటికీ తాను వింటూనే ఉంటానని వెల్లడించారు రమీజ్ రజా. సంగీత ప్రపంచం ఆమె లేని లోటు ఎవరూ పూడ్చ లేరని తెలిపాడు.
లతాజీకి క్రికెట్ అంటే అభిమానం. ఆ స్వరంలో ఏదో మహత్తు ఉందని తెలిపాడు రమీజ్ రజా(Ramiz Raja Babar Lata). ఇవాళ తనకు చాలా బాధగా ఉందన్నాడు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నాడు.
ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సైతం స్పందించాడు లత మరణంపై. ఆమె మరణం తనను బాధకు గురి చేసిందన్నాడు. తాను ఆమె అభిమానినని పేర్కొన్నాడు ఆజమ్. లతా మంగేష్కర్ కు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపాడు.
ఆమె అసాధారణమైన అద్భుతమైన గాయని మాత్రమే కాదని గాన కోకిల అని కొనియాడారు. ఒక స్వర్ణ యుగానికి ముగింపు. లతాజీ మాయా గాత్రం , వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది హృదయాల్లో నిలిచి పోతుంది.
Also Read : బౌలర్లు భళా ఇంగ్లండ్ విలవిల