Lauren Sanchez Ring : నెచ్చెలికి జెఫ్ బెజోస్ భారీ గిఫ్ట్

$500 మిలియ‌న్ల రింగ్ ధ‌ర

Lauren Sanchez Ring : ప్రేమ గుడ్డిది అంటారు. ఓ వైపు విడాకులు ఇచ్చి మ‌రీ ప్రేమాయ‌ణం న‌డిపారు అమెజాన్ ఫౌండ‌ర్, సిఇఓ జెఫ్ బెజోస్ . ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో టాప్ లో కొన‌సాగుతున్నాడు. మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చాడు. ఆపై భారీ ధ‌ర‌ను చెల్లించాడు ప‌రిహారంగా. కోర్టులో విడాకులు వ‌చ్చేంత వ‌ర‌కు ర‌హ‌స్యంగా ఉంచాడు. త‌న ప్రేమ‌ను ఎక్క‌డా వ్య‌క్తం చేయ‌లేదు. చిటికేస్తే వేల కోట్లు. క‌ళ్లు చెదిరే భ‌వంతులు. ఏ నిమిషం లోనైనా ఎక్క‌డికైనా వెళ్ల‌గ‌లిగే సామ‌ర్థ్యం క‌లిగిన ఏకైక బిలియ‌నీర్ జెఫ్ బెజోస్.

అత‌డిని మెస్మ‌రైజ్ చేసింది లవ‌ర్ లారెన్ సాంచెజ్(Lauren Sanchez). ఇద్ద‌రూ 2018లో క‌లుసుకున్నారు. ఆనాటి నుంచి నేటి దాకా ప్రేమాయ‌ణం కొన‌సాగుతూనే ఉంది. చివ‌ర‌కు 2019లో జెఫ్ బెజోస్ , లారెన్ పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇద్ద‌రికి సంబంధించిన వ్య‌క్తిగ‌త ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ అది త‌ప్ప‌ని తేలింది. లారెన్ ముద్దుగుమ్మ‌కు ఏకంగా $500 మిలియ‌న్ల ఖ‌రీదు చేసే డైమండ్ రింగ్ బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

బెజోస్ ప్రేమ‌ను చూసిన వారంతా పిచ్చెక్కి పోతున్నారు. ఔరా ప్రేమ అంటే ఇదేరా అని పేర్కొంటున్నారు. యావ‌త్ లోకం వీరిని చూసి విస్తు పోతోంది. ప్రేమ మైమ‌కం ఇంతలా మైమ‌రిచి పోయేలా చేస్తోందా అన్న‌ది ఆశ్చ‌ర్యంగా మారింది. మొత్తంగా డేటింగ్ నుంచి పెళ్లి దాకా ఇద్ద‌రూ హాట్ టాపిక్ గా మారడం విశేషం.

Also Read : Jeff Bezos Lauren Sanchez

Leave A Reply

Your Email Id will not be published!