Liam Livingstone : మెరిసిన లియామ్ లివింగ్ స్టోన్
24 బంతులు 40 రన్స్ ఒక 4 నాలుగు సిక్సర్లు
Liam Livingstone : ఐపీఎల్ లో మరోసారి మెరుపులు మెరిపించాడు లియామ్ లివింగ్ స్టోన్(Liam Livingstone) . పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ . నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది.
డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టేడియం నలు వైపులా షాట్స్ కొట్టాడు. 16 ఫోర్లు 1 సిక్సర్ తో 92 రన్స్ చేశాడు. చివరి దాకా ఉన్నాడు. మరోసారి అజింక్యా రహానే నిరాశ పరిచాడు. బౌలింగ్ పరంగా కట్టుదిట్టం చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో మరో స్థానం ముందుకు వెళ్లింది. ఇక పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్ జోర్దార్ ఇన్నింగ్స్ ఆడితే లియామ్ లివింగ్ స్టోన్ తనదైన శైలిలో బ్యాట్ కు పని చెప్పాడు.
ఇద్దరూ కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. సింగ్ 24 బాల్స్ లో 42 రన్స్ చేస్తే లివింగ్ స్టోన్ 24 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో ఇందులో ఒక ఫోర్ 4 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : డెవాన్ కాన్వే అరుదైన రికార్డ్