BCCI Selectors : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఉన్నట్టా లేనట్టా
భారత జట్టు ఎంపిక తీరుపై సర్వత్రా ఆగ్రహం
BCCI Selectors : ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది.
గల్లా పెట్టెలో కోట్లు మూలుగుతున్నా జట్టు ఎంపికలో మాత్రం పారదర్శకత లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సమర్థవంతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా ఎందుకని ఎంపిక చేయడం లేదన్న విమర్శలు ఊపందుకున్నాయి.
గత ఏడాది 2021లో యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది టీమిండియా. సరిగ్గా ఏడాది గడిచాక 2022లో ఇదే వేదికపై జరిగిన ఆసియా కప్ -2022 లో సైతం పాకిస్తాన్ , శ్రీలంక చేతిలో దారుణంగా ఓటమి పాలై ఇంటి బాట పట్టింది.
ఇక ప్రపంచ క్రికెట్ లో ఏ జట్టు , ఏ బోర్డు చేయనన్ని ప్రయోగాలు బీసీసీఐ సెలక్షన్ కమిటీ(BCCI Selectors) చేసింది. సుదీర్గ కాలం పాటు విరాట్ కోహ్లీ
నాయకత్వం వహించాక తప్పుకోవడంతో ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఏడుగురిని కెప్టెన్లుగా మార్చింది.
పాండ్యా, శిఖర్ ధావన్ లు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వరుస గాయాలతో కేఎల్ రాహుల్, రోహిత్ జట్టు దూరమవుతూ, ఎంపికవుతూ వస్తున్నారు.
ఇక హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకోవడంతో అతడి స్థానంలో ఏరికోరి ద్రవిడ్ ను తీసుకు వచ్చారు. కానీ జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఆసియా కప్ హాట్ ఫేవరేట్ గా ఉన్న భారత జట్టు టోర్నీలో ఆశించిన మేర రాణించలేదు. మొత్తంగా సెలెక్టర్లను పూర్తిగా మార్చేస్తేనే జట్టు మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ నిద్ర పోతున్నారా లేక ఏం చేస్తున్నారనే దానిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సెలెక్షన్ కమిటీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది.
ఇప్పటి వరకు దానిని భర్తీ చేయక పోవడం విచిత్రం. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో అభయ్ కురువిల్లా తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతానికి చేతన్ శర్మ, సునీల్ జోషి, హర్విందర్ సింగ్ , దేబాశిష్ మహంతి తో కూడిన సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తోంది జట్టును. ఏ వ్యక్తి అయినా
ఐదేళ్లకు మించి ఉండ కూడదు బీసీసీఐ రూల్స్ ప్రకారం.
కురువిల్లా గతంలో జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా నాలుగేళ్ల పాటు పని చేశాడు. సీఏసీకి మదన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనకు 70 ఏళ్లు నిండాయి.
దీంతో ఇద్దరు సభ్యులు కలిగిన సులక్షణా నాయక్, ఆర్పీ సింగ్ లతో కూడిన ఇద్దరే ద్రవిడ్ ను ఎంపిక చేశారు. ఇక టి20 వరల్డ్ కప్ కు అన్ని జట్లు సెప్టెంబర్ 15 లోగా ఎంపిక చేయాలని ఐసీసీ ఆదేశించింది.
ఇప్పటికైనా సెలెక్షన్ కమిటీ మేల్కుంటే బెటర్ . లేక పోతే జట్టుకే కాదు దేశానికే తీరని నష్టం.
Also Read : ఇలా ఆడితే వరల్డ్ కప్ లో కష్టం