Messi Family : మ‌ధుర‌ క్ష‌ణం మెస్సీ కుటుంబం ఆనందం

భార్య‌, పిల్ల‌ల‌తో మెస్సీ హ్యాపీ

Messi Family : ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవసం చేసుకుంది లియోనెల్ మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా. మొత్తం టోర్నీలో 32 జ‌ట్లు పాల్గొన్నాయి. ఫైన‌ల్ కు ఫ్రాన్స్ , అర్జెంటీనా చేరుకున్నాయి. సెమీస్ లో ఫ్రాన్స్ మొరాకోను 2-0 తేడాతో ఓడిస్తే అర్జెంటీనా క్రొయేషియాను 3-0 తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇక ఖ‌తార్ లోని దోహాలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఇరు జ‌ట్లు ఆట ముగిసే స‌మ‌యానికి చెరీ స‌మానంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ త‌ప్ప‌లేదు. అర్జెంటీనాకు ఫైన‌ల్ ఆట ప్రారంభమైన వెంట‌నే కెప్టెన్ మెస్సీ అద్భుత‌మైన గోల్ చేశాడు. ఫ‌స్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా ఆధిపత్యం వ‌హిస్తే ద్వితీయార్థంలో ఫ్రాన్స్ స‌త్తా చాటింది.

చివ‌ర‌కు స‌మ‌యం ఇచ్చినా ఇరు జ‌ట్లు 3-3తో నిలిచాయి. కానీ పెనాల్టీ షూటౌట్ లో మాత్రం అర్జెంటీనా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగింది. ఈ విజ‌యంలో ఫ్రాన్స్ ఫుట్ బాల్ స్ట్రైక‌ర్ల‌ను అడ్డుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు అర్జెంటీనా గోల్ కీప‌ర్ ఎమిలియానో మార్టినెజ్. మ్యాచ్ ముగిసిన వెంట‌నే భావోద్వేగానికి లోన‌య్యాడు మెస్సీ.

కంట త‌డి పెట్టుకున్నాడు. జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి ఆలింగ‌నం చేసుకున్నాడు. గోల్డెన్ గోవ్ అవార్డును మార్టినెజ్ స్వంతం చేసుకున్నాడు. గోల్డెన్ వ‌ర‌ల్డ్ క‌ప్ ను అందుకున్న వెంట‌నే లియోనెల్ మెస్సీ త‌న కుటుంబంతో(Messi Family) ఆ ఆనంద‌పు క్ష‌ణాల‌ను పంచుకున్నాడు. త‌న విజ‌యానికి, త‌న ఇన్నేళ్ల సాక‌ర్ జ‌ర్నీకి స‌హ‌క‌రించిన ఫ్యామీలినే కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు మెస్సీ.

Also Read : మూడుసార్లు విశ్వ విజేత అర్జెంటీనా

Leave A Reply

Your Email Id will not be published!