Liquor Scam Comment : రియల్టర్ సరే మిగతా దొంగలెక్కడ
వామ్మో వెన్నమనేనినా మజాకా
Liquor Scam Comment : దేశ వ్యాప్తంగా ఢిల్లీ మద్యం స్కాం(Liquor Scam) కలకలం రేపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో తెలంగాణ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్దం చివరకు దాడులకు దిగింది.
మధ్యలో ఆప్ కు చుక్కలు చూపిస్తోంది కేంద్రం. ఇది పక్కన పెడితే బంగారు తెలంగాణ అంటూ మాట్లాడిన ప్రతిసారి ఊదరగొడుతున్న సీఎం కేసీఆర్ కు ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
ఎమ్మెల్సీ కవిత పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది బీజేపీ. ఆమె తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. తనకు కరోనా అటాక్ అయ్యిందంటూ ఇంట్లో కూర్చుంది.
ఇక ఆమెకు అనుంగు అనుచరులుగా పేరొందిన వారినందరినీ జల్లెడ పడుతోంది ఈడీ. 25 టీంలు ఏకధాటిగా దాడులు నిర్వహించడం, సోదాలు చేపట్టడం, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకోవడం చకచకా జరిగి పోయింది.
ఆపై కల్వకుంట్ల ఫ్యామిలీకి చెందిన వారంటూ వెన్నమేనని శ్రీనివాస్ రావు ను తన వాహనంలో కాకుండా ఈడీ స్వంత వాహనంలో తీసుకు వెళ్లింది. ఆపై ఏడు గంటల పాటు విచారించింది.
ఢిల్లీ స్కాంలో(Liquor Scam) అభియోగాలు మోపిన వారిలో రామచంద్రన్ పిళ్లైకి చుక్కలు చూపించింది. ఇక ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వ్యక్తిగత
సీఏ (ఆడిటర్ ) గోరంట్ల బుచ్చిబాబుపై అటాక్ చేసింది.
మొత్తం కూపీ లాగింది. ఎక్కడెక్కడ ఏయే కంపెనీలు, ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఈడీ ఆరా తీసింది. పక్కా సమాచారం, ఆధారాలతో సహా ముందు పెట్టడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.
ఒక్క వెన్నమనేని శ్రీనివాస్ రావు షెల్ కంపెనీల ద్వారా ఏకంగా రూ. 2,000 కోట్లు చేతులు మారాలే చేశాడని అనుమానం వ్యక్తం చేస్తోంది ఈడీ. ఇదే
సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు స్టార్ట్ చేసింది.
మరో వైపు పంజాబ్ ఎన్నికల్లో రూ. 200 కోట్లు ఆప్ కు ఇచ్చారని సమాచారం. ఇది కూడా కోడై కూస్తోంది. మొత్తం కల్వకుంట్ల కాన్ దాన్ ఈ స్కాంలో చిక్కుకున్నట్లు అర్థం అవుతోంది.
వెన్నమనేనిది కరీంనగర్ జిల్లా. పిళ్లైకి చెందిన రాబిన్ డిస్టలరీస్ తో శ్రీనివాసరావును విచారించింది. కవిత , పిళ్లై కుటుంబం తిరుమలలో దర్శనం చేసుకోవడం,
ఫోటోలు వైరల్ కావడం ఈడీ విచారణకు మరింత బలం చేకూరినట్లయింది. బంజారా హిల్స్ , మాదాపూర్ , ఉప్పల్ లోని వెన్నమనేని శ్రీనివాసరావు కంపెనీలు , నివాసాలను జల్లెడ పట్టారు. అభిషేక్ రావు, గండ్ర ప్రేం సాగర్ , ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఇందులో భాగమైనట్లు ఈడీ గుర్తించింది.
ఈ మొత్తం వ్యవహారంపై మనీ ల్యాండరింగ్ జరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ, ఐటీ , సీబీఐ
మరింత దూకుడు పెంచాయి.
ఒక రకంగా రియల్టర్ ను అదుపులోకి తీసుకున్నా అసలు దొంగలు ఎవరనేది ఎంత త్వరగా తేలిస్తే అంత మంచిది.
Also Read : ఏపీ సర్కార్ తో నల్సార్ ఒప్పందం