Mahesh Babu : ‘ల‌య‌న్ కింగ్’ చూసి ఏడ్చేశా – ప్రిన్స్

పీకాక్ మ్యాగ‌జైన్ తో మ‌హేష్ బాబు

Mahesh Babu : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మహేష్ బాబు , కీర్తి సురేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఈనెల 12న విడుద‌లై రూ. 200 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది.

ప్రారంభంలో డివైడ్ టాక్ తెచ్చుకున్నా వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ కోట్లు కొల్ల‌గొడుతోంది. ఇప్ప‌టికీ థియేటర్ల వ‌ద్ద మ‌హేష్ బాబు(Mahesh Babu) అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ ప్ల‌స్ , జీఎంబీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఎస్. ఎస్. థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది.

ఇక ప‌రుశురామ్ టేకింగ్, మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ మ‌ధ్య జ‌రిగిన ల‌వ్ , రొమాన్స్ , కెమిస్ట్రీ పండింది. ప్ర‌ధానంగా ప్రిన్స్ మ‌రింత ల‌వ‌ర్ బాయ్ గా చేసిన అభిన‌యం ఆక‌ట్టుకుంది.

గ‌ల్లా పెట్టెలు నింపేలా చేస్తోంది. దేశంలో పేరొందిన ముంబైకి చెందిన ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ పీకాక్ ఈసారి త‌న ముఖ చిత్రంగా మహేష్ బాబును ఎంచుకుంది.

ఈ మేర‌కు ఆయ‌న‌తో ర్యాపిడ్ ఫైర్ కూడా చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్, హాబీస్, అభిప్రాయాలు చెప్పారు మ‌హేష్ బాబు(Mahesh Babu). ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ర్యాపిడ్ ఫైర్ చాలెంజ్ లో ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు.

తాను ప్ర‌తి రోజూ ఎక్కువ‌గా బ్యూటిఫుల్ (అందం) అనే ప‌దాన్ని వాడుతాన‌ని చెప్పాడు మ‌హేష్ బాబు. అయితే హాలీవుడ్ చిత్రం ల‌య‌న్ కింగ్ చూసి ఏడ్చాన‌ని వెల్ల‌డించాడు న‌టుడు ప్రిన్స్.

ఎవ‌రి గురించి ఆలోచించ‌నని, సినిమాలు చూస్తాన‌ని, షూటింగ్ లు అయి పోయాక ఇంటికి వెళ్లి పోతాన‌ని తెలిపాడు. ఇదే త‌న స‌క్సెస్ కు కార‌ణ‌మ‌న్నాడు.

Also Read : ప్రిన్స్ ఆనందం ప‌రుశురామ్ సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!