Mallikarjun Kharge : ప్రెసిడెంట్ ఎన్నికలపై ఖర్గే కామెంట్స్
మా అభిప్రాయం కోరారని రాజ్ నాథ్ చెప్పారు
Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు రాష్ట్రపతి ఎంపిక అగ్నిపరీక్షగా మారింది.
ఈ విషయంలో గెలవాలంటే కనీసం 8,300కి పైగా ఓట్లు రావాల్సి ఉంటుంది మోదీ టీంకు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏం అనుకుంటున్నారనే దానిపై మోదీ తమను కనుక్కోమన్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనతో చెప్పారంటూ తెలిపారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని తెలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా రాజధాని ఢిల్లీలో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ చేపట్టారు.
ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా హాజరు కానుందని తెలిపింది. ఆమె సమావేశం కంటే ముందు ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.
ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా వివాద రహితుడైన అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తే ప్రభుత్వం అంగీకరిస్తుందా అని కూడా మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రశ్నించారు. ఈ విషయంపై రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి సమాధనం చెప్పలేదన్నారు.
ఇవాళ దీదీ సమావేశంలో 22 రాజకీయ పార్టీల అధినేతలు పాల్గొననున్నారు. కొన్ని పార్టీలు ఓకే చెప్పినా ఆ తర్వాత రాలేమని పేర్కొన్నాయి.
ఇక శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఇవాళ అయోధ్య టూర్ లో ఉన్నారు. ఆయన కూడా హాజరు కావడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దూరంగా ఉన్నారు.
Also Read : మూడో రోజు రాహుల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ