Mallu Bhatti Vikramarka: తెలంగాణాలో మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు !

తెలంగాణాలో మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు !

Mallu Bhatti Vikramarka: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని మోనాష్‌ యూనివర్సిటీ – ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో తెలంగాణాలో మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయనతో ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ మూర్తి, మోనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎలిశెట్టి మోహన్‌ సమావేశమై చర్చించారు. బ్యాటరీలలో వినియోగించే లిథియం వంటి కీలక ఖనిజాల ఉత్పాదన భారత్‌లో ఆశించిన మేర జరగడం లేదని వారు చెప్పారు. వాటి ఉత్పత్తికి ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తే.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కీలక ఖనిజాల అంశంపై ఐఐటీ హైదరాబాద్, మోనాష్‌ యూనివర్సిటీ భాగస్వాములుగా పరిశోధనలు చేస్తున్నాయని వివరించారు.

Mallu Bhatti Vikramarka…

సింగరేణి గనుల వద్ద విద్యుత్‌ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఇందుకు సింగరేణి నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన పంపులను ఉపయోగించి పగటిపూట విద్యుత్‌ వినియోగం అధికంగా ఉన్న సమయాల్లో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పాదన చేయవచ్చని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. కొత్తగా ఏర్పాటుకానున్న స్కిల్‌ యూనివర్సిటీతో ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతోందని ప్రొఫెసర్‌ మూర్తి ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. భట్టి స్పందిస్తూ రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశానికైనా ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపారు.

Also Read : Bandi Sanjay Kumar: గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!