Mamata Banerjee : రైల్వే మంత్రిని నిలదీసిన సీఎం
నిరోధక పరికరం ఎందుకు లేదు
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను నిలదీశారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రైల్వే శాఖ ఎందుకని ఏటీపీ (యాక్సిడెంట్ కాకుండా నిరోధించే సిస్టమ్ ) ను ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నించారు.
ఈ శతాబ్దంలో జరిగిన అతి పెద్ద ప్రమాదంగా ఆమె అభివర్ణించారు. సంఘటన ఏ విధంగా జరిగిందో , ఎలా జరిగిందో , దాని వెనుక ఎవరు ఉన్నారని తేలాలంటే సరైన దర్యాప్తు చేయాలని మమతా బెనర్జీ(Mamata Banerjee) డిమాండ్ చేశారు. కుట్ర నిరోధక వ్యవస్థను ఎందుకు అమర్చలేదో వివరించే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి. యాంటీ కొల్లిషన్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదని నిలదీశారు సీఎం.
ఇదిలా ఉండగా 1999లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ లో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. యూపీఏ-2లో ఆమె 2009లో రెండోసారి అదే శాఖను నిర్వహించారు. రైల్వే శాఖ నా బిడ్డ లాంటిది. నేను రైల్వే కుటుంబ సభ్యుడిని. నా సలహాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు సీఎం.
ఈ ఘటనలో చని పోయిన బెంగాల్ ప్రయాణీకులకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు మమతా బెనర్జీ. సాయం కోసం 50 మంది వైద్యులను పంపామని తెలిపారు.
Also Read : Kavach System