Kavach System : ‘క‌వాచ్’ ఉంటే ప్ర‌మాదం జ‌రిగేదా

ఒడిశా రైలు ప్ర‌మాదంపై విచార‌ణ

Kavach System : ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్న ఘ‌ట‌న‌లో భారీగా ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న వెనుక ఏం జ‌రిగింద‌నే దానిపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా గ‌తంలో చోటు చేసుకున్న రైలు ప్ర‌మాదాల ఘ‌ట‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ అత్యాధునిక టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేసింది. దాని పేరు క‌వాచ్ అంటే అర్థం క‌వ‌చం(Kavach System). జీరో యాక్సిడెంట్స్ ల‌క్ష్యాన్ని సాధించేందుకు అభివృద్ది చేయ‌బ‌డిన వ్య‌తిరేక ఘ‌ర్ష‌ణ వ్య‌వ‌స్థ‌. ఇదిలా ఉండ‌గా ఈ ఆప‌రేష‌న్ ఖ‌ర్చు కిలోమీట‌ర్ కు రూ. 50 ల‌క్ష‌లు అవుతుంద‌ని అంచ‌నా.

శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో కోర‌మాండ‌ల్ షాలిమార్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనేందుకు ముందు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మ‌రో రైలు య‌శ్వంత్ పూర్ హౌరా సూప‌ర్ ఫాస్ట్ ప‌ట్టాలు త‌ప్పిన కోచ్ ల పైకి దూసుకెళ్లింది. రైళ్ల మ‌ధ్య ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా నివారించేందుకు క‌వాచ్ పేరుతో స్వ‌దేశీయంగా అభివృద్ది చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్ష‌న్ (ఏటీపీ) వ్య‌వ‌స్థ‌ను భార‌తీయ రైల్వే శాఖ ప్ర‌వేశ పెట్టింది. న‌డుస్తున్న రైళ్ల భ‌ద్ర‌త‌, సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు దీనిని తీసుకు వ‌చ్చింది. క‌వాచ్ ఇక్క‌డ అందుబాటులో లేదు. దీనిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండ‌ర్డ్స్ ఆర్గ‌నైజేష‌న్ (ఆర్డీఎస్ఓ) చేసింది. సాంకేతికత భ‌ద్ర‌త స‌మ‌గ్రత స్థాయి 4 స‌ర్టిఫికెట్ కూడా క‌లిగి ఉంది.

క‌వాచ్ హై ఫ్రీక్వెన్సీ రేడియో క‌మ్యూనికేష‌న్ ను ఉప‌యోగించుకుంటుంది. డ్రైవ‌ర్ రైలును నియంత్రించ‌డంలో విఫ‌ల‌మైతే సిస్ట‌మ్ ఆటోమేటిక్ గా రైలు బ్రేక్ ల‌ను యాక్టివేట్ చేస్తుంది. 5 కిలోమీట‌ర్ల లోపు అన్ని రైళ్లు ఆగి పోతాయి. 2022-23లో క‌వాచ్ కింద 2,000 కిలోమీట‌ర్ల రైలు నెట్ వ‌ర్క్ ను తీసుకు రావాల‌ని ప్లాన్ చేసింది కేంద్రం. దీనిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు కూడా. మొత్తంగా క‌వాచ్ గ‌నుక ఉంటే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాదు.

Also Read : NTR Salman Sonu Sood

Leave A Reply

Your Email Id will not be published!