Mamata Kejriwal : పీఎం అభ్యర్థిగా ఖర్గే బెటర్
మమతా బెనర్జీ..అరవింద్ కేజ్రీవాల్
Mamata Kejriwal : న్యూఢిల్లీ – టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee), ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీదీ, కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు.
Mamata Kejriwal’s Opinion
ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ అయితే బాగుంటుందని ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఇద్దరు సీఎంలు చేసిన ప్రతిపాదన కలకలం రేపింది. దీనిపై వెంటనే స్పందించారు మల్లికార్జున్ ఖర్గే.
ముందు ఆక్టోపస్ లా విస్తరించిన మోదీ , బీజేపీ సర్కార్ ను ఓడించడమే ధ్యేయంగా పెట్టు కోవాలని స్పష్టం చేశారు. ముందు గెలిచేందుకు ప్రయత్నం చేద్దామని, తాను ఏ పదవి కావాలని కోరుకోనంటూ పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే.
దేశంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవి, అంతకంటే ముఖ్యమైనవని మనందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్.
Also Read : Akhilesh Yadav : ఇండియా కూటమిదే విజయం
