Mandeep Singh : ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ గ్రేట్
మన్ దీప్ సింగ్ మాజీ కెప్టెన్ కు కితాబు
Mandeep Singh : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు మన్ దీప్ సింగ్(Mandeep Singh). ఇదిలా ఉండగా కోహ్లీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు కూడా సారథ్యం వహించాడు.
గత ఏడాది యూఏఈలో జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ రిచ్ మెగా టోర్నీ లో మొదటి నుంచీ కొనసాగుతూ వస్తున్నాడు.
లీగ్ లో అగ్రశ్రేణి బ్యాటర్లలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం లీగ్ లో 223 మ్యాచ్ లలో 6,624 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ఉన్నాడు.
కుడి చేతి వాటం కలిగిన ఈ ప్లేయర్ ఒకే సీజన్ లో అత్యధిక పరుగులు 2017లో 973 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ లో పూర్తి ఫిట్ నెస్ విప్లవానికి ఆద్యుడు కోహ్లీదే.
కెప్టెన్ గా ఉన్న సమయంలో ఆటగాళ్ల ఫిట్ నెస్ విధానాలపై ఫోకస్ పెట్టాడు. మాజీ ఆటగాళ్లలో ఒకడైన మన్ దీప్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటి వరకు తాను చూసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పూర్తి ఫిట్ నెస్ కలిగి ఉండడం మామూలు విషయం కాదన్నారు. కాగా గత కొన్నేళ్లుగా కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.
యూఏఈ వేదిగా ఆగస్టు 27 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మేరకు ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం మన్ దీప్ సింగ్(Mandeep Singh) చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Also Read : కరోనా ఎఫెక్ట్ కోచ్ గా లక్ష్మణ్ కు చాన్స్