Mangli Singer : పాటకు ప్రాణం మంగ్లి జానపదం
వెండి తెరపై రాణిస్తున్న సింగర్
Mangli Singer : ఎక్కడ విన్నా మంగ్లి పేరు వినిపిస్తోంది. జానపదానికి ఊతమిస్తూ ముందుకు సాగుతున్న ఈ గాయని వెండి తెర పై కూడా తన గాత్రానికి మెరుగులు దిద్దుతోంది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ గాయకురాళ్లు కావడం విశేషం. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సుంకిడి. ఆమె జానపదానికి పర్యాయ పదంగా మారి పోయింది. సినిమా పాటలే కాదు ఆధ్యాత్మిక గీతాలు కూడా పాడుతుంది. ఇటీవల ఆమె పాడిన పాటల్ హిట్ గా నిలిచాయి. నర్సపల్లె, బతుకమ్మ పాటలు దుమ్ము రేపాయి.
ఒక రకంగా మంగ్లీని తెలంగాణ ముద్దు బిడ్డ అని ఇప్పటికీ భావించే వారు లేక పోలేదు. ప్రాంతం ఏదైనా కళాకారులకు కులం, మతం లేదు. ఇక మంగ్లీ గొంతులో పల్లెతనపు జీర ఉంది. కనుకనే ఆమెను ఆదరిస్తున్నారు. తన వాయిస్ ను సమాదరిస్తున్నారు.
సత్యవతి రాథోడ్ కంటే మంగ్లీగానే జనానికి బాగా తెలుసు. ఆ పేరు ఎక్కడున్నా గుర్తు పట్టే స్థాయికి చేరుకున్నారు. తనను తాను మల్చుకున్నారు మంగ్లి(Mangli Singer). ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గాయకులలో ఒకరిగా కొనసాగుతున్నారు.
జూన్ 10, 1994లో పుట్టారు. ఆమెకు 28 ఏళ్లు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ కు సలహాదారుగా నియమించారు సీఎం జగన్ . ఇది పక్కన పెడితే గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఎన్నో పాటలు పాడారు.
లంబాడా జీవితానికి సంబంధించిన పాటలు , తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కన్నడ భాషలలో ఇప్పటికే పలు గీతాలు పాడారు మంగ్లీ. 2017 నుంచి నేటి దాకా ముందుకు సాగుతున్నారు. ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ కూడా సింగర్ గా పేరొందారు.
పుష్ప మూవీలో ఆమె పాడిన ఊ అంటావా సెన్సేషన్. బంజారా వస్త్రధారణతో ఆకట్టుకుంటోంది మంగ్లీ. అంతే కాదు సద్గురు ప్రతి ఏటా నిర్వహించే ఇషా శివరాత్రి ఉత్సవాల్లో ఆమె ప్రధాన ఆకర్షణగా మారారు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, ఉగాది, సమ్మక్క సారక్క జాతర, శివుని పాటలు దుమ్ము రేపుతున్నాయి.
ప్రస్తుతం మిక్ టీవితో కలిసి పని చేస్తోంది మంగ్లీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో డిప్లొమా కూడా చేశారు. 2013లో వీ6లో మాటకారి మంగ్లీగా(Mangli Singer) , తీన్మార్ వార్తల్లో తన సత్తా చాటింది.
ఓరుగల్లు కోటనడుగు పాట సూపర్ హిట్ గా మారింది. 2020లో వచ్చిన అల వైకుంఠపురంలో మంగ్లీ పాడిన రాములో రాములా బిగ్ హిట్ గా నిలిచింది. 2021లో వచ్చిన సారంగ దరియా పాట సూపర్ గా నిలిచింది.
Also Read : ‘అమ్మ చేతి వంట’ అద్భుతం