Manik Rao Thakeray : బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే – ఠాక్రే
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
Manik Rao Thakeray : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీజేపీని బలపర్చేందుకు, ఇతర పార్టీలను బలహీన పర్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. దమ్ముంటే రాజకీయాలలో ధైర్యంగా ఎదుర్కోవాలని ఇతర పార్టీలను అణగ దొక్కేయాలని ,తాము మాత్రమే పవర్ లో ఉండాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు.
బీహార్ లోని పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి అందుకనే పిలవలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని అనుకోవడం ఒట్టి భ్రమ అనిపేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో ఇవాళ అప్పులు తప్ప అభివృద్ది అన్నది లేకుండా పోయిందన్నారు.
ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మాణిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thakeray). గల్లీలో కొట్లాడుకున్నట్లు నటించడం ఢిల్లీకి వచ్చి చెట్టా పట్టాల్ వేసుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాలను , లోపాయికారి ఒప్పందాలను బయట పెడతామని హెచ్చరించారు. ఇకనైనా మీ ముసుగు తొలగించి ఎన్నికల్లో నిలబడాలని స్పష్టం చేశారు.
Also Read : YS Sharmila : గల్లీలో సిగపట్లు ఢిల్లీలో కౌగిలింతలు
