Manish Sisodia : లిక్కర్ స్కాంలో సిసోడియా విచార‌ణ

సీబీఐ ఆఫీస్ ఆవ‌ర‌ణ వ‌ద్ద భారీ భ‌ద్ర‌త

Manish Sisodia Inquiry : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆప్ అగ్ర నేత‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా కు (Manish Sisodia Inquiry) కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ స‌మ‌న్లు పంపింది. తాను బిజీగా ఉన్నాన‌ని ఢిల్లీ ప్ర‌భుత్వానికి సంబంధించి కీల‌క‌మైన బ‌డ్జెట్ ను త‌యారు చేసే ప‌నిలో ఉన్నాన‌ని అందుకే తాను హాజ‌రు కాలేనంటూ సీబీఐకి తెలిపాడు. దీంతో ఆదివారం విచారించేందుకు స‌మ‌యం ఇచ్చింది.

ఇప్ప‌టికే ఈ కేసులో 34 మందిపై అభియోగాలు మోపింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ. ఇందులో సీబీఐ కోర్టులో స‌మ‌ర్పించిన రెండో నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ క‌విత‌ను కూడా చేర్చింది. కాగా ఇదంతా కావాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు సీఎం, ఎమ్మెల్సీ. రూ. 100 కోట్లు చేతులు మారాయ‌ని, సౌత్ గ్రూప్ పేరుతో లిక్క‌ర్ దందా నడిపించారంటూ ఆరోపించింది.

ఇక క‌విత అయితే ఏకంగా 10 విలువైన ఫోన్ల‌ను ధ్వంసం చేసింద‌ని పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి త‌న‌యుడిని కూడా అరెస్ట్ చేసింది. దీనిపై క‌ల‌క‌లం రేగింది. లిక్క‌ర్ దందా ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌ను ఇటీవ‌ల జ‌రిగిన గోవా, పంజాబ్ రాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా ఖ‌ర్చు చేసింద‌ని ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల‌లో సోదాలు చేప‌ట్టింది. క‌విత‌కు సంబంధించిన ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు తో పాటు ఆమె వ‌ద్ద అసిస్టెంట్ గా ఉన్న బోయ‌న‌ప‌ల్లి అభిషేక్ ను కూడా అదుపులోకి తీసుకుంది.

Also Read : ఆప్..బీజేపీ కౌన్సిల‌ర్ల‌పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!