Massive Protest Punjab : పంజాబ్ సీఎం ఇల్లు ముట్టడి ఉద్రిక్తం
పెద్ద ఎత్తున చేరుకున్న కార్మికులు, సంఘాలు
Massive Protest Punjab : ఓ వైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ లో నిరసనలు మిన్నంటాయి. కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు(Massive Protest Punjab) చేపట్టారు. ఆయన లేని సమయంలో సీఎం ఇంటిని ముట్టడించారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం మాయ మాటలు చెబుతున్నారని, కల్లబొల్లి కబుర్లతో తమను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆరోపించారు. పంజాబ్ లోని సంగ్రూర్ నివాసం వెలుపల బుధవారం భారీ నిరసన కొనసాగింది. పోలీసులు అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డాయి.
అయినా కార్మికులు ఊరుకోలేదు. సీఎం భగవంత్ మాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వ్యవసాయ, కార్మికులు నిప్పులు చెరిగారు. తమకు వేతనాలు ఇచ్చేంత దాకా తాము ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే పెద్ద ఎత్తున చేరుకున్నకార్మికులను చెదరగొట్టేందుకు నానా రకాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం రోజూ వారీ వేతనం రూ. 700 కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని తిరిగి కొనసాగించాలని కోరారు వ్యవసాయ, కార్మికులు.
కాగా అంతకు ముందు 19 రోజుల నిరసనను నిర్వహించారు రైతులు. భగవంత్ మాన్ ప్రభుత్వం తమ డిమాండ్ల ను లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో అక్టోబర్ లో విరమించేందుకు అంగీకరించారు. తీరా సర్కార్ పట్టించుకోక పోవడంతో ఆందోళన బాట పట్టారు.
Also Read : టెమ్ జెన్ ఇమ్నానా మజాకా