Temjen Imna Along : టెమ్ జెన్ ఇమ్నానా మ‌జాకా

ఈ బీజేపీ మంత్రి మామూలోడు కాదు

Temjen Imna Along : ఏమిటిది తాళ్ల లాగుడు పందెం అనుకున్నారా. కానే కాదు..మీరు చూస్తున్న‌ది నిజ‌మే. అత‌డు ఎవ‌రో కాదు మోస్ట్ పాపుల‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్. అంతే కాదు నాగాలాండ్ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో కీల‌క‌మైన మంత్రి టెమ్ జెన్ ఇమ్నా. భార‌తీయ జ‌న‌తా పార్టీలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

క‌ష్ట‌ప‌డి బాగా చ‌దువుకున్నాడు. మొద‌టి నుంచి మ‌నోడికి చ‌దువంటే ఇష్టం. ఇంకేం ప్ర‌భుత్వ టీచ‌ర్ గా ప‌ని చేశాడు. కొంత కాలం పాటు విద్యార్థుల‌కు పాఠాలు చెప్పాడు. కానీ మ‌న‌సు పాలిటిక్స్ వైపు మ‌ళ్లింది. ఆపై కాషాయ జెండా పుచ్చుకున్నాడు. బ‌డిని వ‌దిలి ప్ర‌జా క్షేత్రంలోకి వ‌చ్చాడు.

ఇంకేం ఉన్న‌ట్టుండి భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ దృష్టిలో పడ్డాడు. ఏకంగా బీజేపీ స్టేట్ చీఫ్ గా ఎంపిక‌య్యాడు. ఆ త‌ర్వాత మంత్రిగా కొలువు తీరాడు. ప్ర‌స్తుతం కాషాయ పార్టీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తర్వాత అత్యంత పాపుల‌ర్ క‌లిగిన ప్ర‌జా నేత‌ల్లో టెమ్ జెన్ ఇమ్నా, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ స్టేట్ చీఫ్ , మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ కుప్పుసామి అన్నామ‌లై, క‌ర్నాట‌క‌కు చెందిన తేజ‌స్వి సూర్య‌, కేంద్ర కేబినెట్ లో కొలువు తీరిన కిరెన్ రిజిజుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు.

చాలా మంది లీడ‌ర్లు ఉన్నా వీరు నిత్యం వార్త‌ల్లో, జ‌నం మ‌ధ్య‌న ఉంటూ త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. మోదీ త‌ర్వాత ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది మాత్రం టెమ్ జెన్ ఇమ్నానే(Temjen Imna Along) . ఆయ‌న ప్ర‌తి దానిలో పాజిటివ్ దృక్ఫ‌థాన్ని చూస్తారు.

త‌న ఆహార్యం గురించి ఎంద‌రు ఏమ‌నుకున్నా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతారు. తాజాగా బుధ‌వారం ఫోటో షేర్ చేశారు. ట్విట్ట‌ర్ లో అది ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. తాడును గుంజ‌డంలో పోటీ ప‌డుతున్నారు టెమ్ జెన్ ఇమ్నా.

Also Read : దోషుల విడుద‌ల‌పై సుప్రీంలో బిల్కిస్ స‌వాల్

Leave A Reply

Your Email Id will not be published!